ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన మహిళా విద్యార్థుల కోసం లోటస్ పెటల్ ఫౌండేషన్ (Lotus Petal Foundation) ‘విన్నీ సన్ స్కాలర్‌షిప్ 2026-27’ను అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఎంపికైన అభ్యర్థులకు MBBS కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.65,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.
2026-27 విద్యా సంవత్సరంలో MBBS కోర్సులో ప్రవేశం పొందిన భారతీయ మహిళా విద్యార్థులు అర్హులు.
10వ, 12వ తరగతి పరీక్షల్లో కనీసం 70% మార్కులు (SC/ST/OBC విద్యార్థులకు 60%) సాధించి ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి.
ఆసక్తి కలిగిన విద్యార్థినులు www.b4s.in/yeks/WISS2 పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు దాఖలు చేయడానికి చివరి తేదీ 30 అక్టోబర్ 2026.
విన్నీ సన్ స్కాలర్‌షిప్ 2026-27 మహిళా MBBS విద్యార్థులకు ఏటా రూ.65,000 ఆర్థిక సాయం!







