ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో 3-సంవత్సరాల మరియు 5-సంవత్సరాల లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిచే లాసెట్ తొలి దశ (Phase 1) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) విడుదల చేసింది.
రిజిస్ట్రేషన్ ప్రారంభం సెప్టెంబర్ 24, 2026
రిజిస్ట్రేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 29, 2026
వెబ్ ఆప్షన్ల నమోదు సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 2, 2026 వరకు
సీట్ల కేటాయింపు అక్టోబర్ 6, 2026
కళాశాలల్లో రిపోర్టింగ్ అక్టోబర్ 7 నుండి అక్టోబర్ 9, 2026 వరకు
అభ్యర్థులు అధికారిక పోర్టల్ cets.apsche.ap.gov.in ద్వారా లాగిన్ అయి రిజిస్ట్రేషన్ ఫారంలో వ్యక్తిగత, విద్యా సంబంధ వివరాలను నమోదు చేయాలి. నిర్ణీత రుసుము చెల్లించి ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, మార్క్షీట్లు మరియు సర్టిఫికేట్ల స్కాన్ ప్రతులను అప్లోడ్ చేయాలి. వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి. అభ్యర్థులు నమోదు చేసిన ఆప్షన్లు, ప్రవేశ ప్రమాణాల ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి.
ఏపీ లాసెట్ 2026 తొలి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల







