Trending Posts

Tirumala Laddu: తిరుమల లడ్డు ప్రసాదంపై టీటీడీ కీలక ప్రకటన

TIRUMALA LADDU

తిరుమల లడ్డు ప్రసాదం పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుండడంతో టీటీటీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది.

గత ప్రభుత్వ హాయంలో తిరుమల శ్రీవారి లడ్డు SRIVARI LADDU ప్రసాదం తయారీలో గొడ్డు, పంది కొవ్వు పదార్థాలున్న నెయ్యిని వినియోగించారన్న ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే టీటీడీ నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసి లడ్డు ప్రసాదంలో వినియోగించాలని టీటీడీ TTD BORAD తెలిపింది.

ఈ మేరకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలను పేర్కొన్నది. గతంలో వాడిన నెయ్యి వివరాలు, మరియు ఇతర దినుసులు, ప్రస్తుతం లడ్డు తయారీలో వాడుతున్న నెయ్యి, ఇతర పదార్థాలను వెబ్​సైట్​లో పొందుపర్చింది. కాగా గత వారం రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదం దృష్ట్యా ఈవో కార్యాలయ సిబ్బంది లడ్డు కొనుగోలు దారుల నుంచి ఫీడ్​బ్యాక్​ కూడా తీసుకుంటున్నట్టు టీటీడీ బోర్డు వెల్లడించింది.

Tirumala Laddu: తిరుమల లడ్డు ప్రసాదంపై టీటీడీ కీలక ప్రకటన

Leave a Comment