Trending Posts

ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ బిల్లు: కొత్త నిబంధనలు, లబ్ధిదారులకు గుడ్ న్యూస్

ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడుత లబ్దిదారులు, ఫైనల్ బిల్లు చెల్లింపుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 02 నాటికి 2 లక్షల ఇండ్ల గృహ ప్రవేశాలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ బిల్లు కోసం ఎదురు చూస్తున్న లబ్దిదారులకు సర్కారు శుభవార్తను చెప్పింది.

గతంలో ఇచ్చిన నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ బిల్లుపొందాలంటే… నిర్మాణం మొత్తం పూర్తయి ఇంటికి హాల్, కిచెన్, ఒక బెడ్ రూం, తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్, నీటి సౌకర్యం, బాత్ రూంలు, విద్యుత్ కనెక్షన్ ఇలా అనేక సదుపాయాలు పూర్తి చేసుకున్నవారికే ఫైనల్ బిల్లు చెల్లింపులు చేస్తామని నిబంధనల్లో పేర్కొంది.

TELANGANA GOVT HOUSING SCHEME

కానీ లబ్దిదారులకు ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా కొన్ని నిబంధలు సడలిస్తూన్నట్టు ప్రకటించింది. ఇల్లు అన్ని సౌకర్యాలతో 100 శాతం పూర్తి కాకున్నా.. నివాస యోగ్యంగా ఉంటే ఇందిరమ్మ ఇండ్ల చివరి దశ బిల్లులు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పీ గౌతమ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందిరమ్మ బిల్లుల స్టేటస్ తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

సడలించిన నిబంధనలు ఇవే..

  1. ఫోర్లింగ్ అవసరం లేదు
  2. ప్లాస్టరింగ్ ఇంటి వెలుపల పూర్తయితే చాలు
  3. తలుపులు, కిటికీలు లోపల గదులకు లేకున్నా పర్వాలేదు. ఇంటి ప్రధాన ద్వారం ఉంటే చాలు
  4. పెయింటింగ్ బయల వైపు వేస్తే చాలు.
  5. కరెంట్ వైరింగ్, ప్లంబింగ్ పూర్తి స్థాయిలో లేకపోయినా.. తాత్కాలికంగా ఉన్నా సరిపోతుంది. టాయిలెట్, ఫ్యాన్, లైట్లు ప్రాథమికంగా ఉంటే చాలు

పైన పేర్కొన్న కనీస సౌకర్యాలు ఉంటే వెంటనే తుదిదశ ఇందిరమ్మ ఇల్లు ఫొటోలు తీసుకుని బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో తుది దశకు చేరుకున్న వేలాది ఇండ్ల లబ్దిదారుల బిల్లుల చెల్లింపులకు మార్గం సుగమమైంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/