Trending Posts

రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్..

నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.
భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) మొత్తం 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-1 (సిగ్నల్) 323 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్-3 కింద 6,242 పోస్టులు ఉన్నాయి. నేటి (జూన్ 30) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 29లోపు అధికారిక RRB వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రేడ్-1 పోస్టులకు 18–33 ఏళ్లు, గ్రేడ్-3 పోస్టులకు 18–30 ఏళ్ల వయోపరిమితి వర్తిస్తుంది. విద్యార్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు తదితర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలని అధికారులు సూచించారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/