2026-27 విద్యాసంవత్సరానికి టీజీఎస్సి స్టడీ సర్కిల్ నిర్వహించే ఫ్రీ కోచింగ్ నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ బ్యాచ్ లో ప్రవేశం కోసం అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇందుకోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ వద్ద పది నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఎస్సీ, ఎస్టి, బిసి, దివ్యాంగుల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. వీరి తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి 3 లక్షలకు మించి ఉండరాదు. గ్రాడ్యుయేషన్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 19 జూన్ 2026 నుంచి 12 జులై 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. జులై 19వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది. అందులో ఎంపికైన వారికి ఉచితంగా శిక్షణ ఇస్తారు. పూర్తి వివరాల కోసం tsstadycircle.co.in వెబ్సైట్ ను సంప్రదించవచ్చు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ యూ పి ఎస్ సి కి ఫ్రీ కోచింగ్







