రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఈడీ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 96.95 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 35,600 మంది దరఖాస్తు చేసుకున్నారు. 29,342 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 28, 446 మంది అర్హత సాధించారు. కొత్తగూడెం కు చెందిన బానోతు అజిత్ సాయి 125.95 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. మొదటి పది ర్యాంకులు అబ్బాయిలు సాధించడం విశేషం. ఫలితాల్లో అబ్బాయిల ఉత్తీర్ణత 98.95 కాగా.. అమ్మాయిల ఉత్తీర్ణత 96.57 గా నమోదయింది. పరీక్షకు హాజరైన ఇద్దరు ట్రాంజెండర్ లు ఉత్తీర్ణత సాధించారు. మే 12న ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ కేంద్రాల్లో 59 పరీక్ష కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించారు. ప్రైమరీ కీ, అభ్యంతరాల స్వీకరణ, ఫైనల్ కీ ఆధారంగా ఫలితాలు వెల్లడించారు. ఫలితాలను అభ్యర్థులు edcet.tgche.ac. in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. త్వరలోనే వెబ్ ఆప్షన్ తో పాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం సీట్లు కేటాయించనున్నారు.
ఎడ్ సెట్ లో 96.95 శాతం ఉత్తీర్ణత







