రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిస్తాయి. జూన్ 5వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు 12వ తేదీ ( శుక్రవారం) నాడు ముగిసాయి. రాష్ట్రవ్యాప్తంగా 93 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఎస్ఎస్సి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31,542 మంది పరీక్షలు రాసేందుకు నమోదు చేసుకున్నారు. అయితే వీరులో 17, 768 మంది పరీక్షల హాజరయ్యారు. మిగిలిన 13,774 మంది పరీక్షలకు హాజరు కాలేదు. త్వరలోనే ఫలితాలు వెల్లడించనున్నారు. ఇందులో పాస్ అయిన వారు ఇంటర్ తో పాటు ఇతర కోర్సులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు







