రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ( PG) కోర్సుల్లో 2026- 27 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే CPGET దరఖాస్తు గడువును పొడిగించారు. జూన్ 15వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే 500 అపరాధ రుసుముతో 17వ తేదీ వరకు, రూ. 2 వేల అపరాధ రుసుముతో 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటివరకు పీజీ కోర్సులకు అన్నీ కలిపి సుమారు 44 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పరీక్షలను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొని డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.
CPGET దరఖాస్తు గడువు పొడగింపు







