తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షల్లో 91.22 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. బాలికల్లో 91.62, బాలురు 90.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 13, 14 తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష కోసం రాష్ట్రంలో 57,206 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 51,146 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 46,654 మంది ఉత్తీర్ణత సాధించారు. మహిళలు 30,299 మంది దరఖాస్తు చేసుకోగా.. 27,793 మంది పరీక్షకు హజరయ్యారు. వీరిలో 25,463 మంది పాసయ్యారు. పురుషులు 25,907 మంది దరఖాస్తు చేసుకోగా..23,353 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 21,191 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 రీజియన్ సెంటర్లు, 69 పరీక్ష కేంద్రాల్లో రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 287 ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 49,601 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 80 ఎంసీఏ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 9,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐసెట్ అనుబంధం పూర్తయిన వెంటనే.. కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు
ఐసెట్ ఫలితాలు విడుదల 91.22 శాతం ఉత్తీర్ణత







