Trending Posts

రేపు మోగనున్న బడి గంట

తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం 15 వ తేదీ ( సోమవారం) ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ చివరి వారంలో వేసవి సెలవులు వచ్చాయి. సుమారు 50 రోజులకు పైగా సెలవుల అనంతరం మళ్ళీ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 41 వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 66 లక్షల మంది విద్యార్ధులు చదువు కుంటున్నారు. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నంత, ఉన్నత, మోడల్, కస్తూర్బా గాంధీ, తదితర పాఠశాలలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక .. నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్ పాఠశాలల సైతం నిర్వహి స్తుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం, అడ్మిషన్లు పెంచడం కోసం వేలాది పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యను సైతం అమలు చేస్తోంది.

విద్యార్థులకు అందుతున్న సేవలు:

  • ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థులకు ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పిస్తుంది.
  • ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేస్తుంది.
  • వీటితోపాటు యూనిఫామ్ ఇస్తోంది.
  • విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా పౌష్టికారంతో పెడుతున్నారు. స్కూల్ గేట్ కు నో
    అడ్మిషన్ బోర్డు :
    ప్రభుత్వ పాఠశాలలను బలంపత్రం చేసే దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ” బడిబాట” కార్యక్రమాన్ని చేపట్టింది. ఉపాధ్యా యులు ఇంటింటికి తిరుగుతూ.. విద్యార్థిని చేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే
    రంగారెడ్డి జిల్లా మంచాల మండలం పాఠశాల ప్రారంభోత్సవానికి ముందే విశేష ఆదరణ పొందుతున్నది. ఇప్పటికే పూర్తిస్థాయిలో అడ్మిషన్ పూర్తి అయ్యాయి. పాఠశాల గేటుకు ” నో అడ్మిషన్” బోర్డు పెట్టారు. ఈ పాఠశా లను తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా మార్చేందుకు రాష్ట్రంలోని తొలి పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్నారు. అందుకు అనుగుణంగా కోట్లు వెచ్చించి వసతులు కల్పించారు. ఇంటర్నేషనల్ స్కూల్ కు ధీటుగా ఇక్కడ వసతులు కల్పించారు. సాంకేతికతను ఉపయోగించి, విద్యనందిస్తున్నారు. ఈ పాఠశా లలో 1600 మంది విద్యార్థులకు అవకాశం ఉండగా.. ఇప్పటికే 1700 మందిని తీసుకున్నారు. దీంతో నో అడ్మిషన్ బోర్డు పెట్టవలసి వచ్చింది. ప్రతి తరగతి రెండు సెక్షన్ లుగా విభజించి, 61 మందితో భోధన చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల్లో కూడా అడ్మిషన్ లు జోరందుకున్నాయి. నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇది కొన్ని పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుంది. అనేక పాఠశాలలో విద్యార్థులు లేక మూతపడి పరిస్థితులు సైతం ఉన్నాయి.

పాఠశాలల ప్రారంభానికి ఏర్పాట్లు సిద్ధం :

సోమవారం రోజున పాఠశాల ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పాఠశాలలో శుభ్రం చేయించడం, పరిసరాలను శుభ్రం చేయించడం, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించేలా స్థానిక అధికారులు చొరవ తీసుకున్నారు. పాఠశాల లను సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. సోమవారం పాఠశాలల ప్రారంభంతో పిల్లల రాక తో సందడి నెలకొననుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/