Trending Posts

ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువును ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి పొడిగించింది. ఇప్పటివరకు నాలుగుసార్లు గడువు పెంచగా, విద్యార్థుల సౌకర్యార్థం ఈ నెల 7వ తేదీ వరకు చివరి అవకాశంగా మరోసారి పొడిగించినట్లు బోర్డు కార్యదర్శి అభిలాష్ అభినవ్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
​రాష్ట్రంలోని 436 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇప్పటివరకు సుమారు 90 వేల మంది విద్యార్థులు చేరారని వెల్లడించారు. ఇంకా ప్రవేశాలు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/