Trending Posts

ఎంటీపీఎఫ్, అంబర్‌నాథ్‌లో 162 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

మహారాష్ట్ర అంబర్‌నాథ్‌లోని మెషిన్ టూల్ ప్రొటోటైప్ ఫ్యాక్టరీ (ఎంటీపీఎఫ్).. 61వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 162 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
​ఖాళీల వివరాలు:
​ట్రేడ్ అప్రెంటిస్ (నాన్-ఐటీఐ): 83 ఖాళీలు
​ట్రేడ్ అప్రెంటిస్ (ఎక్స్-ఐటీఐ): 79 ఖాళీలు
​ప్రధాన వివరాలు:
​ట్రేడ్‌లు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎంఎంటీఎం, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్.
​అర్హత: 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.
​వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 15 నుండి 24 సంవత్సరాలు.
​వ్యవధి: నాన్-ఐటీఐకి రెండేళ్లు, ఎక్స్-ఐటీఐకి ఒక ఏడాది.
​స్టైపెండ్: నాన్ ఐటీఐకి మొదటి ఏడాది రూ. 12,600, రెండో ఏడాది రూ. 14,400; ఎక్స్-ఐటీఐకి (1-year trade) రూ. 14,400, (2-year trade) రూ. 16,200.
​ఎంపిక విధానం: విద్యాార్హతల మార్కులు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
​దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రతికి సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి ‘చీఫ్ జనరల్ మేనేజర్, మెషిన్ టూల్ ప్రొటోటైప్ ఫ్యాక్టరీ, అంబర్‌నాథ్’ చిరునామాకు పంపించాలి.
చివరి తేదీ: 27.09.2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/