Trending Posts

గిరిజన సంక్షేమ గురుకులాల్లో మిగులుతున్న సీట్లు..

గిరిజన సంక్షేమ గురుకులాల్లో విద్య, వసతి, ఆహారం ఉచితంగా ఉన్న సీట్లు మిగులుతున్నాయి. పల్నాడు జిల్లాలో 11 గిరిజన సంక్షేమ వసతి గృహాలను 2016లో గురుకులాలుగా మార్చారు. 3 నుంచి 10 వరకు ప్రతి తరగతికి 40 సీట్లు కేటాయించారు. కొన్నింటిలో భవన వసతులు సరిగా లేనందున 5వ తరగతి నుంచి చేర్చుకుంటున్నారు. వాటిలో తరగతికి 40 మంది వంతున 240 సీట్లు ఉన్నప్పటికీ అన్నీ భర్తీ కావడం లేదు. 3 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉన్న 5 స్కూల్స్ లో 320 మందికి ఛాన్స్ ఉన్నప్పటికీ కారంపూడి, వినుకొండ బాలికల పాఠశాలల్లో మినహా అన్నింటిలో ఖాళీలు వున్నాయి.
చిలకలూరిపేట, బెల్లంకొండ, పిడుగురాళ్లలో 100 నుంచి 150 మంది ఉండగా, వినుకొండలో బాలుర పాఠశాలలో 180 మంది, రెంటచింతలో 240 మంది ఉన్నారు. ఆదిమ గిరిజన స్టూడెంట్స్ కు సంబంధించి ప్రత్యేకంగా నాగార్జునసాగర్ పాఠశాలలో ఒక్కొక్క తరగతికి 2 సెక్షన్ల వంతున 640 మంది చేరే ఛాన్స్ ఉన్నప్పటికీ 210 మంది ఉన్నారు. రెండు సెక్షన్ లకు సరిపడా ఉపాధ్యాయులు, సిబ్బంది దాదాపు 40 మంది ఉన్నప్పటికీ ప్రవేశాలు ఎక్కువగా లేవు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/