భారత అంచెల తపాలా శాఖ దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు:
పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష (తెలుగు) చదివి ఉండటం తప్పనిసరి.
కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి (నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది).
వేతనం & ఎంపిక ప్రక్రియ:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు ₹10,000 నుంచి ₹29,380 వరకు వేతనం అందుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ చేపడతారు.
తపాలా శాఖలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ







