Trending Posts

ఐబీపీఎస్ ద్వారా గ్రామీణ బ్యాంకుల్లో 13,706 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీజినల్ రూరల్ బ్యాంకు(RRB)ల్లో ‘కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP RRBs XV)’ ద్వారా 13,706 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-ఎ ఆఫీసర్లు (స్కేల్-I, II, III), గ్రూప్-బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
​మొత్తం ఖాళీలు: 13,706
​ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 8,183
​ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్): 4,256
​ఆఫీసర్ స్కేల్-II & III ఇతర పోస్టులు: 1,267
​అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
​వయోపరిమితి:
​ఆఫీస్ అసిస్టెంట్: 18 – 28 ఏళ్లు
​ఆఫీసర్ స్కేల్-I: 18 – 30 ఏళ్లు
​ఆఫీసర్ స్కేల్-II: 21 – 32 ఏళ్లు
​ఆఫీసర్ స్కేల్-III: 21 – 40 ఏళ్లు
​ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
​దరఖాస్తు రుసుము: SC/ST/PWD అభ్యర్థులకు ₹175, మిగతా వారికి ₹850.
​ముఖ్యమైన తేదీలు:
​ఆన్‌లైన్ దరఖాస్తులు: 01-09-2026 నుంచి 21-09-2026 వరకు.
​ప్రిలిమినరీ పరీక్ష: నవంబరు / డిసెంబరు 2026.
​మెయిన్స్ / సింగిల్ పరీక్ష: జనవరి 2027.
​అర్హత గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/