నేటి ( సోమవారం) నుంచి ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం తిరిగి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు జూన్ 12వ తేదీ నుంచి స్కూలు ప్రారంభం కానున్నాయి.
డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉరట
రాష్ట్రంలో తీవ్రంగా ఎండలున్న నేపథ్యంలో డిగ్రీ, పీజీ విద్యార్థుల సెలవులను పొడిగించారు. ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీ ల పరిధిలోని కాలేజీలకి జూన్ 6 వరకు సెలవులు పొడిగించారు. జూన్ 8వ తేదీన మళ్లీ యధావిధిగా కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్, సిబ్బంది కాలేజీలకు రావాల్సి ఉంటుంది. కాలేజీలు అడ్మినిస్ట్రేషన్, అకాడమిక్ విధులకు ఆటంకం కలగొద్దనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.







