Trending Posts

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) 2026 నోటిఫికేషన్ విడుదల

​ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMS) 2026-27’ పరీక్షా ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఈ పరీక్షను నవంబరు 15, 2026న నిర్వహిస్తారు.
​8వ తరగతి తర్వాత విద్యార్థులు మధ్యలో చదువు మానకుండా (డ్రాపౌట్ కాకుండా) ప్రోత్సహించడం. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తిచేసే వరకు నెలకు రూ.1,000 చొప్పున ఏడాదికి రూ.12,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.
​అర్హతలు 7వ తరగతిలో 55% మార్కులు సాధించి, ప్రస్తుతం ప్రభుత్వ/ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,50,000 మించకూడదు. ఆంధ్రప్రదేశ్‌కు 4,087 స్కాలర్‌షిప్‌లు కేటాయించారు.
​ఎంపిక విధానం రాష్ట్రస్థాయిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT – 90 మార్కులు), స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT – 90 మార్కులు) ఉంటాయి.
​ఆన్‌లైన్‌ దరఖాస్తులు సెప్టెంబరు 11, 2026న ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబరు 12, 2026 వరకు గడువు ఉంది.
​అర్హులైన విద్యార్థులు పాఠశాల హెచ్‌ఎమ్‌ల ద్వారా ఆన్‌లైన్ బోర్డు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/