ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ (CAPF) లలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,871 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హత ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పాసై ఉండాలి.
వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. (ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది).
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మరియు ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక విధానం ఉంటుంది.
దరఖాస్తు గడువు ఈ రోజు నుంచి ప్రారంభమై ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
1,871 ఉద్యోగాలకు నోటిఫికేషన్







