బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు 80, తెలంగాణకు 50 ఖాళీలు కేటాయించారు.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లో కనీసం ఏడాది ఆఫీసర్గా అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసే రాష్ట్రానికి చెందిన స్థానిక భాషలో ప్రావీణ్యం తప్పనిసరి.
వయోపరిమితి: 01-08-2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 15 ఏళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ₹48,480 నుంచి ₹85,920 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹850; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలకు ₹175.
ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబరు 17, 2026 నాటికి బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీ







