Trending Posts

పీజీఐఎంఈఆర్‌ చండీగఢ్‌లో 243 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 243 నర్సింగ్ ఆఫీసర్ (గ్రూప్ ‘బి’) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
​అర్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ / పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ / డిప్లొమాతో పాటు ఆసుపత్రిలో కనీసం ఏడాది క్లినికల్ అనుభవం ఉండాలి.
​వయస్సు 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి (నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).
​ నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతం ఉంటుంది.
​ ఆన్‌లైన్ సీబీటీ (CBT) టెస్ట్ మరియు విద్యా అర్హతల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
​దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి. అక్టోబరు 03, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/