పేద, ప్రతిభావంతమైన విద్యార్థుల ఉన్నత చదువులకు చేయూతనందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫౌండేషన్ ‘ఎస్బీఐ ప్లాటినం జూబిలీ ఆశా స్కాలర్‌షిప్ 2026’ పథకాన్ని ప్రారంభించింది. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆసరాగా నిలిచేందుకు ఈ ప్రముఖ విద్యా సహాయ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు కేటగిరీని బట్టి సంవత్సరానికి రూ. 15,000 నుంచి గరిష్టంగా రూ. 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. 9వ తరగతి నుంచి 12వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు యూజీ (UG), పీజీ (PG), ఎంబీబీఎస్, ఐఐటీ, ఐఐఎమ్ మరియు అర్హత కలిగిన విదేశీ విద్యా ప్రోగ్రామ్‌లలో చదువుతున్న అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈ నిధులను ట్యూషన్ ఫీజు, వసతి, పుస్తకాలు, పరీక్ష ఫీజులు మరియు విద్యా పరికరాల ఖర్చులకు వినియోగించుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 19-09-2026 నాటికి కేవలం ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పేద విద్యార్థులకు ‘ఎస్బీఐ ప్లాటినం జూబిలీ ఆశా స్కాలర్‌షిప్ 2026’







