స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) విభాగాల్లో 1,871 సబ్-ఇన్స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బి తో పాటు ఢిల్లీ పోలీస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. 01.08.2026 నాటికి వయోపరిమితి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి (సంబంధిత వర్గాలకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది). ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుండి రూ.1,12,400 వరకు జీతం లభిస్తుంది.
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT), ఫిజికల్ టెస్ట్ (PET/PST), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 10 నుండి ప్రారంభమవ్వగా, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబరు 30, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.100 కాగా, ఎస్సీ, ఎస్టీ, మహిళలు మరియు మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ లో 1,871 ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల







