ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం రెండేళ్ల పశుసంవర్ధక డిప్లమా కోర్సులో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను పశుసంవర్ధక పాలిటెక్నిక్ రెండేళ్ల కోర్స్ అందుబాటులో ఉంది. యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్లు భర్తీ చేయనుంది. మొత్తం 990 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 330, ప్రైవేట్ కాలేజీలో 660 సీట్లు ఉన్నాయి. పదవ తరగతి పాసైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్కులు ఆధారంగానే ఎంపిక ఉంటుంది. విద్యార్థులు ఆగస్టు 31వ తేదీ 2026 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. జనరల్, బీసీ విద్యార్థులకు వెయ్యి రూపాయలు, ఎస్సీ, ఎస్టి, దివ్యాంగులకు 550 రూపాయలు ఫీజు ఉంది. మే 26వ తేదీన రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. జూన్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
SVVU లో పశుసంవర్ధక డిప్లోమా ప్రవేశాలకు నోటిఫికేషన్







