Trending Posts

CIPET అడ్మిషన్ టెస్ట్

చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ దేశవ్యాప్తంగా ఉన్న సి పేట్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహించనుంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు మే 31వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మొత్తం నాలుగు కోర్సులో దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. డిప్లమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ ( మూడేళ్లు), డిప్లమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ ( మూడేళ్లు), పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్ / కామ్ ( ఏడాదిన్నర), పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ & టెస్టింగ్ ( పీ జీడి& పి పి టి) రెండేళ్ల వ్యవధి కోర్సులు ఉన్నాయి. అభ్యర్థులు కోర్సులకు అనుగుణంగా పదవ తరగతి, డిప్లమా, డిగ్రీ చేసిన వారు అర్హులు. వయస్సు పరిమితి ఏమీ లేదు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. జనరల్, ఓబిసి, ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు 250 ఉంది. మే 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. నాలుగవ తేదీ నుంచి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 7వ తేదీన పరీక్ష ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/