మాస్ మ్యూచువల్ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా ఎల్ఎల్ పి లో ఇంటర్ను పోస్టులు భర్తీ చేయనుంది. ఇందుకోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. 2025 లేదా 2026 విద్యా సంవత్సరంలో బీకాం, ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. ఎంపిక రెండు దశలో ఉంటుంది. మొదట ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రతిభను బట్టి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రూ. 21 వేల స్టైఫండ్ చెల్లిస్తారు. అలాగే రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తారు. ఆసక్తి గలవారు జూన్ 1, 2026 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పూర్తి వివరాలకు placementexecutive1_cr_task@telangana.gov.in వెబ్సైట్ నీ సంప్రదించండి.







