Trending Posts

కొత్తగా మరో 2,769 పాఠశాలలోప్రీ ప్రైమరీ విద్య

2026 – 27 సంవత్సరానికి గాను 2,769 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. గత బడ్జెట్ సందర్భంగా 2000 నుంచి 2500 వరకు పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించాలని భావించింది. అయితే జిల్లాల నుంచి డిఇఓ ఇచ్చిన నివేదికల ఆధారంగా.. ఈ సంవత్సరం 2,769 పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ తేడాది 1000 పాఠశాలల్లో ఫ్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించింది. ఇప్పుడు మొత్తం కలిపి 4,131 పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్య అందుబాటులో ఉంది. ఓ ఆర్ ఆర్ లోపల 529 పాఠశాలలు, ఓ ఆర్ ఆర్ బయట 2,240 పాఠశాలలో ప్రీ ప్రైమరీ ప్రారంభం కానుంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 275 ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 145 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కోసం ఒక్కో పాఠశాలకు 1 .70 లక్షలు కేటాయించారు. ఆయా పాఠశాలల్లో ఒక ఆయాను, ఒక ఇన్స్పెక్టర్ కలెక్టర్ నియమించనున్నారు. ఒక్కో పాఠశాలలో తాత్కాలిక పద్ధతిన ఇద్దరు ఉపాధ్యాయులను నియమించనున్నారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/