Trending Posts

జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు వెల్లడి

దేశంలోని ఐఐటి బీటెక్ కోర్సులు ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటి కాలేజీలో సీట్లు భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రవేశ ల కోసం దేశవ్యాప్తంగా 1,87,389 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,79,694 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 56,880 మంది అర్హత సాధించారు. ఇందులో 10, 107 బాలికలు ఉండగా.. 44,773 మంది బాలురు ఉన్నారు. 23 ఐఐటి కాలేజీలో 18,160 సీట్లు ఉండగా ఈ ఏడాది మరో 300 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ పరీక్షలో బిహర్ కు చెందిన శుభం కుమార్ 330 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించారు. మహిళల విభాగంలో అరేహీ దేశ్ పాండే 280 మార్కులతో టాపర్ గా నిలిచారు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సైతం సత్తా చాటారు. మొదటి పది ర్యాంకులో రెండు ర్యాంకులు సాధించారు. జూన్ 2 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/