కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ , నావి ముంబై.. బలు విభాగాలు పోస్టులు భర్తీ చేయనుంది. మొత్తం 36 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తుంది. ప్రాజెక్టు ఇంజనీర్ 02, టెక్నీషియన్ 21, యాడ్ ఆపరేషన్ సూపర్వైజర్ 01, షూటింగ్ ఆపరేటర్ 12 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఐటిఐ, డిప్లమా, డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు. మే ఒకటి నాటికి పోస్టును బట్టి 50 నుంచి 55 ఏండ్లు మించి ఉండరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మాజీ ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. పోస్టును అనుసరించి రూ. 11, 392 నుంచి 50,060 వేతనం లభిస్తుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. జూన్ 22, 23 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే అడ్రస్ : అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ , వాగాన్ రిపేర్ వర్క్ షాప్, ఆటోనగర్, వడ్లపూడి, గాజువాక, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్. పూర్తి వివరాలకు konkanrailway.com సంప్రదించండి.
కొంకన్ రైల్వేలో పోస్టుల భర్తీ







