పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య 2025–26 లో ప్రభుత్వ బ్యాంకులకు ఎనిమిది బ్యాంకులు కొత్తగా 13, 223 ఉద్యోగ నియామకాలు చేపట్టాయి. ఇందులో ఎక్కువ మంది ఉద్యోగులను ఎస్ బీ ఐ నుంచి నియమించుకుంది. 2024–25 సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 6,14,980 గా ఉండగా..2025–26 మార్చి 31 నాటికి 6,28,203కి చేరింది. 2025 ఆర్థిక సంవత్సరం ఉద్యోగ నియామకాల్లో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా 8,905 ఉద్యోగులను నియమించింది. దీంతో బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 2,36,226 నుంచి 2,45,131కు చేరింది. బ్యాంక్ అఫ్ బరోడా – 1,685, బ్యాంక్ అఫ్ మహారాష్ట్ర ₋ 1,005, కెనరా బ్యాంక్ – 567, పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 527, బ్యాంక్ అఫ్ ఇండియా – 446, ఇండియన్ బ్యాంక్ – 153 మంది ఉద్యోగులను నియమించుకున్నాయి. డిజిటలైజేషన్, ఆటోమేషన్ అవుతున్నప్పటికీ… బ్యాంకుల విస్తరణ నేపథ్యకారణంగా ఉద్యోగుల అవసరం కూడా పెరుగుతుంది.
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 13 వేల ఉద్యోగాలు







