తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీలో 58 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో 68.71 శాతం, రెండవ సంవత్సరంలో 47.70 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలకు 3, 98, 459 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 1,72,056 మంది ఉన్నారు. రెండో సంవత్సరం విద్యార్థులు 56,904 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. అయితే గతంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తగ్గింది. అధికారిక వెబ్సైట్ ద్వారా మార్కుల మెమోలను పొందవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. ఉత్తీర్ణత సర్టిఫికెట్ అందే వరకు ఆన్లైన్ మెమోను భద్రపరచుకోవాలని సూచించింది.
మావోయిస్టు పార్టీ మాజీ అగ్ర నేత దేవ్ జీ ప్రతిభ
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అడ్వాన్స్ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ తన ప్రతిభ చాటారు. ఉద్యమ నేపథ్యంలోనే మధ్యలో వదిలేసిన చదువును, ఇప్పుడు మళ్లీ కొనసాగించారు. అధికారుల అనుమతితో ఆయన ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఈ పరీక్షల్లో తన ప్రతిభ చాటుతూ 614 మార్కులతో సత్తా చాటారు. అలాగే ఇటీవల నిర్వహించిన లాసెట్ 2026లోనూ దేవ్ జీ 57మార్కులతో రాష్ట్ర స్థాయిలో 347ర్యాంక్ సాధించారు. లాయర్ కావాలన్న సంకల్పంతో దేవ్ జీ ఇంటర్ తో పాటు లా సెట్ రాసినట్టు తెలుస్తోంది.







