ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేయనుంది. 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ట్రాన్స్ కో లో 200 పోస్టులు, జెన్ కో లో 100 పోస్టులు, ఈపీడీసీఎల్ లో 135 పోస్టులు, ఎస్పీడీసీఎల్ లో 134 పోస్టులు, సీపీడీసీఎల్ లో 60 పోస్టులు భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు గాను ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం, మెకానికల్ విభాగాల్లో బీటెక్, బి ఈ పూర్తిచేసిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 30వ తేదీ నుంచి జూలై 27వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరో రెండు, మూడు రోజుల్లో వెలువడనున్నాయి
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త..







