రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారీ సంఖ్య లో 15,982 పోస్టులు భర్తీ చేయనుంది. అంగన్వాడీ టీచర్, సహాయకుల పోస్టులకు ఈ సారి ఇంటర్మీడియట్ తప్పనిసరి. అలాగే పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని తీసుకు వచ్చింది. ఎంపిక విధానంలో ఇంటర్వ్యూకు అనుమతిస్తూ జీవో నం. 4, మార్కుల వెయిటేజీ ఖరారు చేస్తూ జీవో నం. 6 జారీ చేసింది. మల్టీజోన్ – 1 పరిధిలో మొత్తం 20, 584 కేంద్రాల్లో 1,853 టీచర్లు, 7,737 హెల్పర్లు పోస్టులు మొత్తం కలిపి 9,590 ఖాళీలు ఉన్నాయి. మల్టీజోన్ – 2 పరిధిలో 15,197 అంగన్వాడీ కేంద్రాల్లో 1,247 టీచర్లు, 5,145 హెల్పర్లు కలిపి 6,392 ఖాళీలు ఉన్నాయి.
జిల్లాల వారీగా గుర్తించిన ఖాళీలు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు:
ఆదిలాబాద్ 96, 406
కొత్త గూడెం :158, 826
హనుమకొండ : 37,140
హైదరాబాద్ : 130, 273
జగిత్యాల : 46, 172
జనగామ : 16,75
భూపాలపల్లి : 31,77
గద్వాల : 53,177
కామారెడ్డి : 47,269
కరీంనగర్ : 50, 119
ఖమ్మం : 93, 394
ఆసిఫాబాద్ : 91,261
మహబూబాబాద్ : 84,318
మహబూబ్ నగర్ : 40, 199
మంచిర్యాల : 57, 257
మెదక్ : 25, 266
మేడ్చల్ : 51, 157
ములుగు : 73, 233
నాగర్ కర్నూల్ : 103,387
నల్గొండ : 88, 374
నారాయణ పేట : 29, 106
నిర్మల్ : 55, 276
నిజామాబాద్ : 50, 290
పెద్దపల్లి : 37, 117
రాజన్నసిరిసిల్ల : 21, 53
రంగారెడ్డి : 46, 365
సంగారెడ్డి : 35, 274
సిద్దిపేట : 57, 145
సూర్యాపేట : 61, 191
వికారాబాద్ : 49, 238
వనపర్తి : 34, 112
వరంగల్ : 35, 172
భువనగిరి : 40, 118







