TG EAPCET మొదటి విడత వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా జూలై 1వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం జూన్ 29వ తేదీ వరకు ఆకాశముంది. ఈ ఏడాది కౌన్సిలింగ్ కోసం 84,002 మంది అభ్యర్థులు కౌన్సిలింగ్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే కౌన్సిలింగ్ కి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీల్లో సుమారు 1,14,007 సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటా కింద 81,620 సీట్లు ఉన్నాయి. విశ్వవిద్యాలయాలు వాటి పరిధిలోని 22 కాలేజీలో 6046 సీట్లు ఉన్నాయి. రెండు ప్రైవేటు విశ్వవిద్యాలయంలో 1800 సీట్లు ఉండగా.. వీటిలో కన్వీనర్ కోటా కింద 1260 సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలకు సంబంధించి 151 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,06,161 సీట్లు ఉన్నాయి. వాటిలో 74, 314 సీట్లు కన్వీనర్ కోట కింద ఉన్నాయి.
TG EAPCET వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ షురూ..







