భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ లో 20 ట్రైయినీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మెకానికల్ బ్రాంచ్ లో బీఈ, బీటెక్ చేసిన వారు అర్హులు. రాత పరీక్ష, షార్ట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. వయసు 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఇదేళ్ళు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యంగులకు సడలింపు ఉంటుంది. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువు జులై 1. మొదటి ఏడాది నెలకు రూ. 30,000
రెండో సంవత్సరం నెలకు రూ. 35,000.
మూడో సంవత్సరం నెలకు రూ. 40,000 వేతనం ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి రూ. 12,000 పుట్ వేర్ అలావెన్స్ లు, యూనిఫామ్, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తారు. 100 మార్కులతో ఉండే ఈ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం మార్కులు రావాలి. పరీక్ష చెన్నై లో ఉంటుంది. పూర్తి సమాచారం కోసం https://www.bel-india.in వెబ్ సైట్ ను సంప్రదించండి.
భారత ఎలక్ట్రానిక్ 28 ట్రైయినీ ఇంజనీర్ పోస్టులు..







