తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువును ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి పొడిగించింది. ఇప్పటివరకు నాలుగుసార్లు గడువు పెంచగా, విద్యార్థుల సౌకర్యార్థం ఈ నెల 7వ తేదీ వరకు చివరి అవకాశంగా మరోసారి పొడిగించినట్లు బోర్డు కార్యదర్శి అభిలాష్ అభినవ్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని 436 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇప్పటివరకు సుమారు 90 వేల మంది విద్యార్థులు చేరారని వెల్లడించారు. ఇంకా ప్రవేశాలు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు







