Trending Posts

నేటి నుంచి ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి పీజీ ప్రవేశాల (AP PGCET) కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రక్రియ సెప్టెంబరు 3న ప్రారంభమై 8వ తేదీ వరకు కొనసాగుతుంది. సర్టిఫికెట్ల ఆన్‌లైన్ పరిశీలన సెప్టెంబరు 4 నుంచి 12 వరకు ఉంటుంది.
​అభ్యర్థులు సెప్టెంబరు 11 నుండి 15 వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. సీట్ల కేటాయింపు సెప్టెంబరు 21న చేపట్టి, అదే రోజు నుంచి కళాశాలల్లో తరగతులు, రిపోర్టింగ్ ప్రక్రియ ప్రారంభమవుతాయి.
​రిజిస్ట్రేషన్ ఫీజుగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 550 చెల్లించాలి. దరఖాస్తుదారులు ఒరిజినల్ సర్టిఫికెట్లను PDF ఫార్మాట్‌లో మాత్రమే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలు, 150కి పైగా అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/