Trending Posts

ఎంఈసిఎల్‌లో 122 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: సెప్టెంబరు 12 నుంచి దరఖాస్తులు ప్రారంభం

నాగ్‌పూర్‌లోని ప్రముఖ మినీరత్న కంపెనీ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (MECL) 122 నాన్-ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
​ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంటెంట్ (06), మెకానిక్-కమ్-ఆపరేటర్-డ్రిల్లింగ్ (30), అసిస్టెంట్-మెటీరియల్స్ (16), టెక్నీషియన్-సర్వే (12), టెక్నీషియన్-డ్రిల్లింగ్ (12), అసిస్టెంట్-అకౌంట్స్ (10), ఎలక్ట్రీషియన్ (07), జూనియర్ డ్రైవర్ (06) తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.
​అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ (B.A/ B.Com/ B.Sc/ BBA/ BCA మొదలైనవి), CA/CMA ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయోపరిమితి 30 ఏళ్లు మించకూడదు. ఎంపికైన వారికి నెలకు అకౌంటెంట్ పోస్టుకు రూ.22,900-55,900, జూనియర్ డ్రైవర్‌కు రూ.19,600-47,900, ఇతర పోస్టులకు రూ.20,200-49,300 వరకు వేతనం అందుతుంది.
​స్క్రీనింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 12 నుంచి అక్టోబరు 11, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/