బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) 205 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-1తో పాటు మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-2, 3, 4 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, లేదా ఎంసీఏ పూర్తి చేసి, అనుభవం (ఎక్స్పీరియన్స్) ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక విధానం ఉంటుంది.
పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ https://bankofindia.bank.in/ ను సందర్శించవచ్చు.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 205 ఉద్యోగాలకు నోటిఫికేషన్







