ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ (NMMS) 2026-27’ పరీక్షా ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఈ పరీక్షను నవంబరు 15, 2026న నిర్వహిస్తారు.
8వ తరగతి తర్వాత విద్యార్థులు మధ్యలో చదువు మానకుండా (డ్రాపౌట్ కాకుండా) ప్రోత్సహించడం. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తిచేసే వరకు నెలకు రూ.1,000 చొప్పున ఏడాదికి రూ.12,000 స్కాలర్షిప్ లభిస్తుంది.
అర్హతలు 7వ తరగతిలో 55% మార్కులు సాధించి, ప్రస్తుతం ప్రభుత్వ/ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,50,000 మించకూడదు. ఆంధ్రప్రదేశ్‌కు 4,087 స్కాలర్షిప్లు కేటాయించారు.
ఎంపిక విధానం రాష్ట్రస్థాయిలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT – 90 మార్కులు), స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT – 90 మార్కులు) ఉంటాయి.
ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబరు 11, 2026న ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబరు 12, 2026 వరకు గడువు ఉంది.
అర్హులైన విద్యార్థులు పాఠశాల హెచ్‌ఎమ్‌ల ద్వారా ఆన్లైన్ బోర్డు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) 2026 నోటిఫికేషన్ విడుదల







