భారతీయ రైల్వేలో జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన నోటిఫికేషన్ (CEN No. 04/2026) దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో (సెప్టెంబరు 13) ముగియనుంది.
మొత్తం దేశవ్యాప్తంగా 4,029 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. (సికింద్రాబాద్ జోన్లో 111 ఖాళీలు ఉన్నాయి).
ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎస్ అండ్ టీ, స్టోర్ ఆర్ఆర్బీ విభాగాలు. నెలకు రూ. 35,400 వరకు జీతం ఉంటుంది.
ఎంపిక స్టేజ్-1, స్టేజ్-2 కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు (CBT), ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 13 నాటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
రైల్వేలో 4,029 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు గడువు పూర్తి కానుంది







