Trending Posts

ఏపీ టెట్ 2026 ఫలితాలు విడుదల.. ఫలితాల వివరాలివే!

​ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2026) ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో ఇన్-సర్వీస్ టీచర్లలో 51 శాతం మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు వెబ్‌సైట్ tet2dsc.apcfss.in ద్వారా అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను చూడవచ్చు.
​ఫలితాలను సులభంగా తెలుసుకోవడానికి 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా కూడా సమాచారం పొందే వెసులుబాటు కల్పించారు. టెట్‌లో విజయం సాధించిన అభ్యర్థులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. అర్హత సాధించలేకపోయిన వారు నిరుత్సాహపడకుండా మున్ముందు రాబోయే అవకాశాలకు మరింత పట్టుదలతో సిద్ధం కావాలని కోరారు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/