Trending Posts

UPSC ESE 2027: 480 గ్రూప్ ఏ, బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

​యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE) 2027 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాలలో మొత్తం 480 గ్రూప్ ‘ఏ’, ‘బి’ పోస్టులను భర్తీ చేయనున్నారు.
​సంబంధిత సబ్జెక్టులో బీఈ / బీటెక్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
​వయస్సు జనవరి 1, 2027 నాటికి 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
​ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్స్, పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ), మెడికల్ ఎగ్జామినేషన్ మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ 16, 2026 దరఖాస్తు ప్రారంభం.
​అక్టోబర్ 6, 2026 చివరి తేదీ.
​ప్రిలిమినరీ పరీక్ష జనవరి 31, 2027 న ఉంటుంది.
​మెయిన్స్ పరీక్ష: జూన్ 18, 2027 ఉంటుంది.
​దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉండగా, ఇతరులు రూ. 200 చెల్లించాలి. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/