హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ ఐటీ కంపెనీ ‘విన్‌టెక్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ (WinTech Services India Pvt. Ltd.) కంటెంట్ రైటర్, కంటెంట్ స్పెషలిస్ట్ మరియు ప్రొడక్ట్ రీసెర్చ్ స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 2024, 2025, 2026 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
అనుభవం ఫ్రెషర్స్ లేదా 0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.2.4 లక్షల (2.4 LPA) వరకు వేతనం అందిస్తారు.
పని ప్రదేశం: గచ్చిబౌలి, హైదరాబాద్.
ఉద్యోగం ఫుల్ టైమ్ (Full Time) ఉంటుంది.
కావాల్సిన నైపుణ్యాలు
అభ్యర్థులకు మంచి రీసెర్చ్, అనలిటికల్, ఇంగ్లీష్ రైటింగ్ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి. SEOపై ప్రాథమిక అవగాహన, MS Excel/Google Sheets పరిజ్ఞానం అవసరం. Shopify, WooCommerce వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు ChatGPT వంటి AI టూల్స్‌పై అవగాహన ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థులను మొదటి రౌండ్‌లో ఫేస్-టు-ఫేస్ ఇంటర్వ్యూ (Face-to-Face Interview) ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన వారు ఇచ్చిన గూగుల్ ఫారమ్ లింక్ (https://forms.gle/bZQVabwRKU4RibZt9) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 17, 2026 వరకు చేసుకోవచ్చు.
హైదరాబాద్ లో ఉద్యోగావకాశాలు విన్‌టెక్ సర్వీసెస్ లో కంటెంట్ రైటర్ పోస్టులు







