నేషనల్ టెస్ట్ హౌస్ (NTH) 2026 సంవత్సరానికి గానూ కాంట్రాక్ట్ ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో సీనియర్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు 21, జూనియర్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు 15 ఉన్నాయి.
సంబంధిత టెక్నికల్, మేనేజ్‌మెంట్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ, మైక్రోబయాలజీ తదితర విభాగాల్లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు పోస్టును బట్టి రూ. 40,000 నుండి రూ. 70,000 వరకు వేతనం అందనుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.nth.gov.in నుండి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. నింపిన దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాల కాపీలను జతచేసి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సెప్టెంబర్ 26, 2026 నాటికి అందేలా ఆఫ్‌లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది.
నేషనల్ టెస్ట్ హౌస్‌లో 36 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ప్రకటన







