మొదటి సంవత్సరం లో ప్రాక్టికల్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ లో కీలక మార్పులు తీసుకొచ్చింది. గతంలో కేవలం ఎంపీసీ, బైపీసీలో రెండో సంవత్సరంలో మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో మార్పులు చేసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ప్రాక్టికల్స్ కి ప్రాధాన్యత ఇస్తూ. . మొదటి సంవత్సరం కూడా ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయించింది. మొదటి సంవత్సరంలో లాంగ్వేజ్ తో పాటు సైన్స్, సబ్జెక్టులో కూడా ప్రాక్టికల్స్ నిర్వహించనుంది. ప్రాక్టికల్స్ కోసం ప్రత్యేకంగా మార్కులు కేటాయించింది. ఇలా కేటాయించిన మార్కులు థియరీ ఎగ్జామ్ లో తగ్గ ఉన్నాయి. గతంలో ఆర్ట్ సబ్జెక్టుకు వంద మార్కులకు పరీక్ష నిర్వహించగా.. 80 మార్కులకు నిర్వహించనున్నారు. 20 మార్కులు ప్రాక్టికల్స్ ఉన్నాయి. సైన్స్ సభ్యులకు కూడా వివిధ సబ్జెక్టులో మార్పుల ఆధారంగా ప్రాక్టికల్స్ పోను ఇతర మార్కులకు థియరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇదిలా ఇలా ఉంటే.. ఈ ఏడాది నుంచే 10+ 2 విధానాన్ని తీసుకురావాలని మొదట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అది ఈ ఏడాది సాధ్యం కాకపోవడంతో యధావిధిగా ఇంటర్ కాలేజి లు నిర్వహిస్తుంది. ఐతే మొదటి సంవత్సరంలో ప్రాక్టికల్స్ తీసుకొచ్చి, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
ఇంటర్ బోర్డు సరికొత్త నిర్ణయం







