ఇండియన్ నేవీలో పర్మనెంట్ కమిషన్ అధికారుల కోసం 10+2 ( బీటెక్) క్యా డేట్ ఎంట్రీ స్కీం కింద నాలుగేళ్ల బీటెక్ కోర్సుల ప్రవేశాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు మే 29వ తేదీ నుంచి జూన్ 18వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ 30 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 30 పోస్టులు ఉన్నాయి. మొత్తం 60 పోస్టులు ఉండగా ఇందులో 8 మహిళలకు కేటాయించారు. 2 జులై 2007 నుంచి 1 జనవరి 2010 మధ్య జన్మించిన వారు అర్హులు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులో కనీసం 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. సీనియర్ సెకండరీ పరీక్ష ( 10+2) లేదా దానికి సమానమైన దానిలో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే పదో తరగతి లేదా 12వ తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్టులో కనీసం 50% మార్కులు ఉండాలి. వీటితోపాటు జేఈఈ ( మెయిన్స్) -2026 పరీక్ష రాసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరి. జేఈఈ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా షార్ట్ లిస్టు చేస్తారు. వీరికి ఎస్ఎస్ బి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అనంతరం మెడికల్ పరీక్షలు చేస్తారు. మార్కులు, మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా తుది జాబితా విడుదల చేస్తారు. ఎంపికైన వారు నాలుగేళ్ల బీటెక్ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ అందజేస్తారు. ఇంటర్వ్యూలు దేశంలోని ప్రధాన నగరాలైన బెంగుళూరు, భోపాల్, కోల్ కత్తా, విశాఖపట్నంలో ఈ ఎడాది సెప్టెంబర్ లో నిర్వహిస్తారు. అలాగే శిక్షణ సమయంలో మెరిట్ ఆధారంగా 7 అభ్యర్థులను కొచ్చిలోని ఎస్ సి డబ్ల్యూ లో బీటెక్ ఇన్ నావెల్ ఆర్కిటెక్చర్ & షిప్ బిల్డింగ్ కోర్సుల కోసం ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది జనవరిలో కోర్సులు ప్రారంభమవుతాయి.
ఇండియన్ నేవీలో బీటెక్ కోర్సులో ప్రవేశాలకు ఆహ్వానం







