ఇంటర్మీడియట్ పర్యావరణ విద్యా పరీక్ష 29వ తారీకు వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష మే 28వ తేదీన నిర్వహించాల్సి ఉంది. అయితే 28వ తేదీన బక్రీద్ పండుగ సెలవు ఉన్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేశారు. మే 29న 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షను నిర్వహించనున్నారు. ఇతర పరీక్ష లు యధావిధిగా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్ కాలేజీలో ప్రిన్సిపాళ్ళు, విద్యార్థులు గమనించగలరు.
29న ఇంటర్ పర్యావరణ విద్యా పరీక్ష







