ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( TET) షెడ్యూల్ విడుదలైంది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జూన్ 5వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 25 తేది నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్ లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఆగస్టు 24వ తేదీన ప్రాథమిక ” కీ “విడుదల చేస్తారు. ఆగస్టు 25వ తేదీ నుంచి 31వ తేదీల్లోపు అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 8వ తేదీన తుది ” కీ” విడుదల చేస్తారు. సెప్టెంబర్ 15 వ తేదీన తుది ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే డీఎస్సీ రాసి అభ్యర్థులతో పాటు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ రాసుకునే అవకాశం కల్పించారు. పూర్తి వివరాలకు tet2dsc.apcfss.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. మరి ఏమైనా సందేహాలు ఉంటే.. 8121947387, 8125046997, 7995649286 నెంబర్లను సంప్రదించవచ్చు.
ఏపీ టెట్ కు దరఖాస్తుల ఆహ్వానం







