Trending Posts

టీచర్లకు ప్రత్యేక టెట్

ఉద్యోగంలో ఉన్న టీచర్లకు ప్రత్యేకత పెట్టు టెట్ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా రెండు టెట్లు నిర్వహించనుంది. ఉపాధ్యాయులు సర్వీస్ లో కొనసాగాలన్న, పదోన్నతులు పొందాలన్న జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ( NCTE) నిబంధనల ప్రకారం టెట్ అర్హత తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే మొదట ఈ నిర్ణయం మీద ఉపాధ్యాయులు వ్యతిరేకత వ్యక్తం అయింది. తమకు ప్రత్యేకత టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం డీఎడ్, బీఈడీ పూర్తి చేసిన ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం ఏడాదికి రెండుసార్లు రెగ్యులేర్ టెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సర్వీసులో ఉన్న ఉద్యోగుల కోసం రెండుసార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/